30, మార్చి 2015, సోమవారం

యోగాసనాలు వేయటంలోని సూచనలు :

  • భోజనానంతరం వెంటనే యోగాసనాలు వేయకూడదు. భోజనం తరువాత కనీసం 4 గంటలు, అల్పాహారం (టిఫిన్‌) తరువాత 2గంటలు విరామం ఉండాలి.
  • స్నానానికి ముందయినా, తరువాతయినా యోగాసనాలు వేయవచ్చు. అయితే దేనికయినా అరగంట గ్యాప్‌ ఉండాలి.
  • ఆసనాలు, వ్యాయామం ఒకసారి కలగలుపు చేయకూడదు.
  • వ్యాయామంచేసిన తరువాత శవాసనంవేసి విశ్రాంతి తీసుకుని ఆసనాలు వేయటం ప్రారంభించవలెను.
  • ఒక ఆసనం వేసి తరువాత ఆ భంగిమలో శరీరానికి విశ్రాంతి నివ్వటం చాలా ముఖ్యం అన్ని సమస్యలనూ వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండాలి.
  • ఒక్కో ఆసనానికీ మధ్య కొంత గ్యాప్‌ ఉండాలి.
  • ఆసనాలు వేసి తరువాత హాయిగా విశ్రాంతిగా ఉండాలి.
  • అలసిపోయినట్లుగా చెమటలు పట్టడంలాంటివి ఉండకూడదు.
  • ప్రారంభంలోనే శక్తికి మించి ఆసనాలు వేయాలని అనుకోకూడదు.
  • నెమ్మదిగా ప్రారంభించి విూ కనుగుణంగా సమయం పెంచుతూ ఉండాలి.
  • ఈ ప్రతిరోజూ సాధన చేయటం వల్లనే పురోగతి ఉంటుంది.
  • మహిళలు బహిష్టు సమయంలో ఆసనాలు వేయకూడదు. అలాగే గర్భిణులు 5వ నెలనుంచి ప్రసవానంతరం 3,4 నెలల వరకు ఆసనాలు వేయకూడదు.
Read More